
సంగారెడ్డి, 24 అక్టోబర్ (హి.స.) సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాజొల గ్రామ శివారులోని చెరుకు తోటలో గుట్టుగా పేకాట ఆడుతున్న 11 మంది జూదరులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 1,80,000 (లక్షా ఎనభై వేల రూపాయలు) నగదు ను స్వాధీనం చేసుకున్నారు. గ్రామ శివార్లో రాత్రి వేళ జన సంచారం లేని ఒక చెరుకు తోటను పేకాట స్థావరంగా మార్చుకుని కొందరు వ్యక్తులు నిత్యం జూదం ఆడుతున్నారనే పక్కా సమాచారం తో హద్నూర్ పోలీసులు గురువారం రాత్రి పేకాట స్థావరాలపై మెరుపు దాడి చేశారు. దట్టంగా పెరిగిన చెరుకు తోట మధ్యలో బృందాలుగా చేరి పేకాట ఆడుతున్న వారిని పోలీసులు చుట్టుముట్టారు.
అరెస్టయిన 11 మంది జూదరులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సుజిత్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు