
సిద్దిపేట, 24 అక్టోబర్ (హి.స.)
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలోని కావేరి యూనివర్సిటీని శుక్రవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందర్శించారు. కావేరి యూనివర్సిటీ ఉపకులపతి వెల్చాల ప్రవీణ్ రావు, అధికారులు గవర్నర్ కు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన ఏఐ, ఎంఎల్ ల్యాబ్, ఎంటమాలజీ ల్యాబ్, సాయిల్ హెల్త్ ల్యాబ్లను సందర్శించారు. అనంతరం డ్రోన్, రోబో టెక్నాలజీ ప్రదర్శన గవర్నర్ తిలకించారు. బయోలాజికల్ ప్రొడక్ట్స్ ల్యాబ్, సహజ వ్యవసాయం పరిశోధనను కూడా సందర్శించి పరిశీలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు