
వేములవాడ, 24 అక్టోబర్ (హి.స.)
పేదల సొంతింటి కల ప్రజా ప్రభుత్వంలో నెరవేరుతుందని, రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లను అందజేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. వేములవాడ రూరల్ మండలం పోశెట్టిపల్లి, అర్బన్ మండలంలోని గుర్రంవానిపల్లిలో శుక్రవారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశానికి ఆది శ్రీనివాస్ హాజరై లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ.. పేద ప్రజలకు పక్కా ఇళ్లు ఉండాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారని, ఈ క్రమంలోనే ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు పొందిన లబ్ధిదారుల మాటలు వింటుంటే ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు