
వనపర్తి, 24 అక్టోబర్ (హి.స.)
తనకు భగీరథుడే ఆదర్శమని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం పెద్దమందడి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన భగీరథుడి విగ్రహాన్ని ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టుదలలో భగీరథుడే ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం అన్నారు. తాను ఎల్లవేళలా భగీరథ మహర్షినే ఆదర్శంగా తీసుకుంటానని సగరుల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అమలుపరిచి తెలంగాణను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశానికే రోల్ మాడల్ నిలిచారన్నారు. రిజర్వేషన్ల ప్రకారం సగరులకు అవకాశం ఉన్నచోట గుర్తింపుని ఇస్తామన్నారు. పెద్దమందడి మండల కేంద్రంలో 20 లక్షల రూపాయలతో సగరుల సామూహిక భవనాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..