
ఢిల్లీ,24, అక్టోబర్ (హి.స.) : దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రక్షాళనకు చేపట్టే ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమానికి రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు (సీఈవోలు) సన్నద్ధం కావాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశించింది. బుధ, గురువారాల్లో దిల్లీలో జరిగిన సీఈవోల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ ఈమేరకు ఆదేశాలు జారీచేశారు. ఎస్‌ఐఆర్‌పై అనుమానాలను నివృత్తి చేశారు. రాష్ట్రాల్లో చివరగా నిర్వహించిన ఎస్‌ఐఆర్ ప్రకారం ప్రస్తుత ఓటర్లను మ్యాపింగ్ చేసే విషయంలో ఇదివరకు జారీచేసిన మార్గదర్శకాల కింద తీసుకున్న చర్యల గురించి కమిషన్ సమీక్షించింది. వచ్చే ఏడాది కాలంలో ఎన్నికలకు వెళ్లే అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమబెంగాల్‌లలో పరిస్థితులను తెలుసుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు