దిల్లీలో ఆత్మాహుతి దాడికి ప్లాన్‌.. భగ్నం చేసిన అధికారులు
ఢిల్లీ,24, అక్టోబర్ (హి.స.) దేశ రాజధాని దిల్లీ (Delhi)లోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి ప్లాన్‌ చేయగా.. పోలీసులు దాన్ని భగ్నం చేశారు. ఈ క్రమంలో ఐఎస్ఐఎస్‌తో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశ
NIA


ఢిల్లీ,24, అక్టోబర్ (హి.స.) దేశ రాజధాని దిల్లీ (Delhi)లోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి ప్లాన్‌ చేయగా.. పోలీసులు దాన్ని భగ్నం చేశారు. ఈ క్రమంలో ఐఎస్ఐఎస్‌తో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.

నిఘా సమాచారం ఆధారంగా దిల్లీలోని సాదిక్‌ నగర్‌, భోపాల్‌లలో దిల్లీ సూపర్‌ సెల్ పోలీసులు సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ క్రమంలో ఆత్మాహుతి దాడులకు శిక్షణ పొందుతున్న ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు భోపాల్‌కు చెందిన అద్నాన్‌ కాగా.. మరొకరు మధ్యప్రదేశ్‌కు చెందినవారు. నిందితులకు ఐసిస్‌తో సంబంధాలు ఉన్నాయని, దిల్లీలో ఓ పెద్ద ఆత్మాహుతి దాడికి ప్లాన్‌ చేశారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సీనియర్ అధికారి తెలిపారు. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు పలు ఎలక్ట్రానిక్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారి నుంచి మరింత సమాచారం తెలుసుకునేందుకు విచారిస్తున్నామన్నారు. వీరి మొత్తం నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతుందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande