కర్నూల్ బస్సు ప్రమాదం కలచివేసింది..
అమరావతి, 24 అక్టోబర్ (హి.స.): కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బస్సులోనే చాలామంది ప్రయాణికులు సజీవదహనం అవ్వడం అత్యంత దురదృష్టకరమని విచారం వ్యక్త
Deputy CM Pawan Kalyan


అమరావతి, 24 అక్టోబర్ (హి.స.): కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బస్సులోనే చాలామంది ప్రయాణికులు సజీవదహనం అవ్వడం అత్యంత దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వం తరఫున సూచించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని రకాలుగా భద్రతా ప్రమాణాలు ఉండేలా చర్యలు చేపట్టాలని రవాణా శాఖకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande