
విజయవాడ, ,24, అక్టోబర్ (హి.స.) మన అందరి ప్రథమ బాధ్యత అడవులను కాపాడటం.. దాని కోసం అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. విజయవాడలో రాష్ట్ర స్థాయి అటవీశాఖ అధికారుల వర్క్ షాపులో పాల్గొన్న పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత నేను చాలా ఇష్టంతో ఎంచుకున్నవి పర్యావరణం, అటవీ శాఖలు అన్నారు. ఒక వ్యవస్థ నడవాలి అన్నా.. ఒక సంస్థ ముందుకు వెళ్ళాలి అన్నా.. వాటిని నడిపే వ్యక్తులు చాలా ముఖ్యం అన్నారు.. రివ్యూ మీటింగుల ద్వారా సిబ్బంది కొరత ఉన్న విషయం నా దృష్టికి వచ్చింది. ఇక్కడున్న అధికారులకు పని భారం ఎక్కువ ఉంది.. నేను అర్థం చేసుకోగలను.. ఈ సమస్య గురించి కేబినెట్ లో కూడా ప్రస్తావించాను అన్నారు.. ఎట్టి పరిస్థితుల్లో డ్యూటీ చేసే అధికారులను ఇబ్బంది పెడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.. ఈ విషయం కూటమి పార్టీల నాయకులకు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు పవన్ కల్యాణ్.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు