
మంచిర్యాల, 25 అక్టోబర్ (హి.స.)
ఏసీబీ అధికారులకు మరో అవినీతి
చేప చేజెక్కింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న కొమరం భీం జిల్లా సహకార అధికారి రాథోడ్ దిక్కు శనివారం ఏసీబీ అధికారులకు చిక్కారు. బెజ్జూర్ పిఎసిఎస్ లో పనిచేస్తున్న మాజీ సీఈవో వెంకటేశ్వర్ గౌడ్ను రెన్యువల్ చేసేందుకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో రెండు విడుదలగా ఇచ్చేందుకు రూ. 8 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో రూ.2 లక్షలు విడుదలగా డబ్బులు ఇవ్వాలని ఇచ్చేందుకు మాజీ సీఈవో వెళ్ళగా, జిల్లా సహకార అధికారి రాథోడ్ దిక్కు నాయక్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ కలెక్టరేట్ లో ఏసీబీ అధికారులు కేసును విచారిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..