నవంబర్ 6న అచ్చంపేటలో ఉచిత మల్టీ స్పెషాలిటీ మెడికల్ క్యాంప్.. ఎమ్మెల్యే వంశీకృష్ణ
నాగర్ కర్నూల్, 25 అక్టోబర్ (హి.స.) ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా నవంబర్ 6న అచ్చంపేట పట్టణంలోని ఏరియా హాస్పిటల్లో పెద్ద ఎత్తున నిర్వహించబోయే ఉచిత మల్టీ స్పెషాలిటీ మెడికల్ క్యాంప్ను నియోజకవర్గం తోపాటు ఇతర జిల్లాల ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని టీపీస
ఆదిలాబాద్ ఎమ్మెల్యే


నాగర్ కర్నూల్, 25 అక్టోబర్ (హి.స.)

ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా నవంబర్ 6న అచ్చంపేట పట్టణంలోని ఏరియా హాస్పిటల్లో పెద్ద ఎత్తున నిర్వహించబోయే ఉచిత మల్టీ స్పెషాలిటీ మెడికల్ క్యాంప్ను నియోజకవర్గం తోపాటు ఇతర జిల్లాల ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ శనివారం ఒక ప్రకటనలో కోరారు. సీబీఎం ట్రస్ట్ చైర్ప ర్సన్ డాక్టర్ చిక్కుడు అనురాధ సహకారం, మహబూబ్నగర్లోని ఎస్పీఎస్ మెడికల్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబోయే ఇట్టి మల్టీ స్పెషాలిటీ మెడికల్ క్యాంపులో ప్రజలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి వైద్య సేవలందించడమే కాకుండా మందులు కూడా ఉచితంగా అందజేస్తారని, తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande