
హైదరాబాద్, 25 అక్టోబర్ (హి.స.)
హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోని వంగర గురుకుల స్కూల్లో విద్యార్థిని శ్రీవర్షిత ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. స్కూల్ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్తో పాటు వార్డెన్ వేధింపుల వల్లే శ్రీవర్షిత ఆత్మహత్య చేసుకున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.
శ్రీవర్షిత అనే అమ్మాయి వంగర గురుకుల స్కూల్లో సూసైడ్ చేసుకుని చనిపోయింది. మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో వంగర గురుకుల స్కూల్ వస్తుంది. శ్రీవర్షిత హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన అమ్మాయి. మంత్రి నియోజకవర్గంలో విద్యార్థిని చనిపోతే ప్రభుత్వం స్పందించలేదు అని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు