బీహార్లో ఎన్నికల వేళ ఆర్జేడీకి షాక్.. కీలక నాయకురాలు బీజేపీలో చేరిక
పాట్నా, 25 అక్టోబర్ (హి.స.) బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆర్జేడీకి బిగ్ షాక్ తగిలింది. ఆర్జేడీ రాష్ట్ర మహిళా విభాగం నాయకురాలు ప్రతిమా కుష్వాహా పార్టీకి గుడ్బై చెప్పారు. శనివారం ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వా
ఆర్జేడీకి షాక్.


పాట్నా, 25 అక్టోబర్ (హి.స.)

బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆర్జేడీకి బిగ్ షాక్ తగిలింది. ఆర్జేడీ రాష్ట్ర మహిళా విభాగం నాయకురాలు ప్రతిమా కుష్వాహా పార్టీకి గుడ్బై చెప్పారు. శనివారం ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా దిలీప్ జైస్వాల్ మాట్లాడుతూ.. అట్టడుగు స్థాయి నాయకులకు ఆర్జేడీలో గౌరవం లేదు అని ఆరోపించారు. ఆర్జేడీ, కాంగ్రెస్లో బంధుప్రీతి, వంశపారంపర్య రాజకీయాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఈ కారణంగానే ఆ పార్టీ నాయకులు చాలా మంది బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్డీఏ మళ్లీ బీహార్లో లో మూడింట రెండు వంతుల మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande