బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో పెట్టాలి.. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్
హైదరాబాద్, 25 అక్టోబర్ (హి.స.) బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ పెట్టాల్సిందేనని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావు డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు ప్రత్యేకంగా రిజర్
వి హనుమంతరావు


హైదరాబాద్, 25 అక్టోబర్ (హి.స.)

బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ పెట్టాల్సిందేనని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావు డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్గాంధీ నాడు పాదయాత్రలో స్పష్టంగా ప్రకటించారని పేర్కొన్నారు. తాము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్రెడ్డి శక్తి వంచన లేకుండా బీసీ రిజర్వేషన్ల అమలుకు కృషి చేశారని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉందని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు, ఎంపీలు అంతా కలిసి ప్రధాని మోదీతో మాట్లాడి రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande