గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు
పార్వతీపురం, 25 అక్టోబర్ (హి.స.) , :గిరిజన ప్రాంతా ల్లో విద్యాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కొత్తవలసలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో అదనపు భవనాల
గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు


పార్వతీపురం, 25 అక్టోబర్ (హి.స.)

, :గిరిజన ప్రాంతా ల్లో విద్యాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కొత్తవలసలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో అదనపు భవనాల నిర్మాణానికి శుక్రవారం ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘రూ.185 కోట్లతో రాష్ట్రంలో 45 ఆశ్రమ పాఠశాలల్లో అదనపు భవన నిర్మాణాలు చేపడతాం. పలు వసతి గృహాల్లో 2,030 మరుగుదొడ్లను నిర్మిస్తున్నాం’ అని తెలిపారు. అనంతరం వసతి గృహంలో ‘ముస్తాబు’ అనే వినూత్న కార్యక్రమానికి మంత్రి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande