ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి..నెల్లూరు.జిల్లాలో మరో బస్సు ప్రమాదం
అమరావతి, 25 అక్టోబర్ (హి.స.) ఆంధ్ర‌ప్రదేశ్‌లోని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మరో బస్సు ప్రమాదం జరిగింది. పెళ్లకూరు మండలం కొత్తూరు జాతీయ రహదారి వద్ద వేగంగా వస్తున్న ఎక్స్ప్రెస్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు సైడ్ ఐరన్ భారీ గేట్లను ఢీ కొట్టింది. ముందు వెళ్తున్
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి..నెల్లూరు.జిల్లాలో మరో బస్సు ప్రమాదం


అమరావతి, 25 అక్టోబర్ (హి.స.)

ఆంధ్ర‌ప్రదేశ్‌లోని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మరో బస్సు ప్రమాదం జరిగింది. పెళ్లకూరు మండలం కొత్తూరు జాతీయ రహదారి వద్ద వేగంగా వస్తున్న ఎక్స్ప్రెస్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు సైడ్ ఐరన్ భారీ గేట్లను ఢీ కొట్టింది. ముందు వెళ్తున్న లారీని అధిగమించబోయి ఐరన్ భారీ గేట్లను కొట్టింది. రాజమండ్రి నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో ఇద్దరు డ్రైవర్లు, 34 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని సమీక్షించారు. ప్రయాణికులను ప్రత్యాన్మాయ వాహనాల్లో తరలించే విధంగా ఏర్పాట్లు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande