ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో.. మూడు కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్
నల్గొండ, 25 అక్టోబర్ (హి.స.) నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండల కేంద్రంలోని ఐకేపీకి చెందిన రైతులు ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని నార్కెట్పల్లి అద్దంకి రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ... గత ఇరవై రోజులుగా ధాన్యం
రైతుల ధర్నా


నల్గొండ, 25 అక్టోబర్ (హి.స.)

నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండల కేంద్రంలోని ఐకేపీకి చెందిన రైతులు ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని నార్కెట్పల్లి అద్దంకి రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ... గత ఇరవై రోజులుగా ధాన్యం తీసుకొచ్చినప్పటికి అధికారులు కొనుగోలు ప్రారంభించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా రైతుల రాస్తారోకోతో మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్థంభించింది. పోలీస్లు సంబంధిత అధికారులతో మాట్లాడి.. రాస్తారోకో విరమింపజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande