హైదరాబాద్ లో హిట్ అండ్ రన్.. కారు ఢీకొని వ్యక్తి మృతి
హైదరాబాద్, 25 అక్టోబర్ (హి.స.) హైదరాబాద్ నగరంలోని హైదర్ షాకోట్లో శనివారం దారుణ ఘటన జరిగింది. స్థానిక చౌరస్తా వైపు వేగంగా వచ్చిన కారు.. కృష్ణ అనే వ్యక్తిని ఢీ కొట్టింది. కారు కింద నలిగిన అతను.. అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కారును అక్కడ ఆపకుండా
హిట్ అండ్ రన్


హైదరాబాద్, 25 అక్టోబర్ (హి.స.) హైదరాబాద్ నగరంలోని హైదర్ షాకోట్లో శనివారం దారుణ

ఘటన జరిగింది. స్థానిక చౌరస్తా వైపు వేగంగా వచ్చిన కారు.. కృష్ణ అనే వ్యక్తిని ఢీ కొట్టింది. కారు కింద నలిగిన అతను.. అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కారును అక్కడ ఆపకుండా డ్రైవర్ పరారయ్యాడు. కారును పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు. కానీ.. మితిమీరిన వేగంతో కారు పరారవ్వడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. స్థానికులు చెప్పిన వివరాలతో నార్సింగి పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సమీపంలో ఉన్న సీసీటీవీల్లో రికార్డైన ప్రమాద దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande