మద్యం టెండర్లపై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
హైదరాబాద్, 25 అక్టోబర్ (హి.స.) తెలంగాణ లో మద్యం దుకాణాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసిన విషయం తెలిసిందే. అయితే, రాష్ట్రంలో బీసీ బంద్, బ్యాంకుల బంద్లతో దరఖాస్తు చేసుకోలేకపోయామన్న ఫిర్యాదులతో ఎక్సైజ్ శాఖ మద్యం షాపుల దరఖాస్తుల గడవ
హై కోర్ట్


హైదరాబాద్, 25 అక్టోబర్ (హి.స.)

తెలంగాణ లో మద్యం దుకాణాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసిన విషయం తెలిసిందే. అయితే, రాష్ట్రంలో బీసీ బంద్, బ్యాంకుల బంద్లతో దరఖాస్తు చేసుకోలేకపోయామన్న ఫిర్యాదులతో ఎక్సైజ్ శాఖ మద్యం షాపుల దరఖాస్తుల గడవును ఈ నెల 23 వరకు పొడిగించింది. అయితే, దరఖాస్తును గడువు పెంచడం చట్ట విరుద్ధమంటూ పలువురు మద్యం వ్యాపారులు తెలంగాణ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు వారి పిటిషన్లపై ఇవాళ మరోసారి ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి ఎన్ తుకారంజీ తీర్పును రిజర్వు చేశారు. దీంతో ఓ వైపు ప్రభుత్వం కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుందోనని ఆసక్తిగా చూస్తుంటే.. మరోవైపు గడువు తర్వాత మద్యం షాపులకు దరఖాస్తు చేసిన ఆశావహుల్లో తమ పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande