
ముంబై,25,,అక్టోబర్ (హి.స.)
మహారాష్ట్రలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మహారాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి చంద్రశేఖర్ బవంకులే (Chandrashekhar Bawankule) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. అందరి ఫోన్లు, వాట్సప్ ఖాతాలపై నిఘా (Phones Under Surveillance) ఉంచామని వ్యాఖ్యానించారు. దీనిపై పలువురు నేతలు విమర్శలు వ్యక్తం చేయడంతో మంత్రి నాలుక్కరుచుకున్నారు. తాను భాజపా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడానని.. ప్రజలను ఉద్దేశించి కాదని స్పష్టతనిచ్చారు.6
పార్టీ కార్యకర్తలు చేసే పనులు, వ్యాఖ్యలు, వాట్సాప్‌లో వచ్చే ప్రతిచర్యలను తమ వార్ రూమ్ సమీక్షిస్తుందనే ఉద్దేశంతో అందరి ఫోన్లు నిఘాలో ఉంటాయని వ్యాఖ్యానించినట్లు వెల్లడించారు. వాటి ఆధారంగానే పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తుందన్నారు. ఈ విషయంపై తమ నేతలు స్పష్టతతోనే ఉన్నారని.. ఇతర పార్టీ నేతలు తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకొని.. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ