బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినా ఉపయోగం లేదు. మంత్రి సీతక్క
హైదరాబాద్, 25 అక్టోబర్ (హి.స.) అధికారంలోని లేని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే నియోజకవర్గ ప్రజలకు ఉపయోగం ఉండదని అన్నారు మంత్రి సీతక్క. ఇవాళ ఆమె జూబ్లీహిల్స్ నియెజకవర్గ పరిధిలోని బోరంబండ, జ్యోతినగర్ కాలనీలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ పాల్గొన్న
మంత్రి సీతక్క


హైదరాబాద్, 25 అక్టోబర్ (హి.స.)

అధికారంలోని లేని బీఆర్ఎస్

పార్టీ అభ్యర్థి గెలిస్తే నియోజకవర్గ ప్రజలకు ఉపయోగం ఉండదని అన్నారు మంత్రి సీతక్క. ఇవాళ ఆమె జూబ్లీహిల్స్ నియెజకవర్గ పరిధిలోని బోరంబండ, జ్యోతినగర్ కాలనీలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. చేయి గుర్తుకు ఓటెయ్యాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ అభివృద్ధికి నవీన్ యాదవ్ గెలుపు చాలా అవసరమని అన్నారు. మూడుసార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిన అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని అన్నారు. అందుకే పేదలకు ఉచితంగా బియ్యం, ఉచిత రవాణా, రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. తమ ప్రభత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4.5 లక్షల మందికి ఇండ్లను మంజూరు చేశామని సీతక్క తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande