
సంగారెడ్డి, 25 అక్టోబర్ (హి.స.)
అక్షయ పాత్ర సేవలు స్ఫూర్తి దాయకమని రాష్ట్ర, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండలంలో హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ప్రతిష్ట్మాకంగా నిర్మిస్తున్న హరే కృష్ణ కల్చరల్ సెంటర్ నిర్మాణం పనులను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం మహా నర్సింహ హోమం, గర్భాలయ యంత్ర స్థాపన పూజ కార్యక్రమము లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు కొత్త ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ వాహనాలను జెండా ఊపి మంత్రి దామోదర్ రాజనర్సింహ, టీజీఐసీసీ చైర్పర్సన్ నిర్మలాజగ్గారెడ్డి తో కలసి ప్రారంభించారు . అనంతరం అక్షయ పాత్ర ఫౌండేషన్ నిర్వహిస్తున్న అతిపెద్ద కిచెన్ ను పరిశీలించారు . ఆధునిక వంట గదులను, స్నాక్స్, ఆటోమేటిక్ కూరగాయల వాషింగ్, కటింగ్ మెషిన్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హరే కృష్ణ కల్చరల్ సెంటర్లో రాధాకృష్ణ విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు నిర్వహించిన మహా నర్సింహ హోమం, గర్భాలయ యంత్ర స్థాపన పూజలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సనాతన ధర్మ మహోన్నత సంస్కృతిక వారసత్వాన్ని, విలువలను ప్రాచుర్యంలోకి తేవటానికి అద్భుత అధ్యాత్మిక సంస్కృతి కేంద్రంగా ఇది నిలుస్తుందని వెల్లడించారు. ---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు