రాష్ట్ర వ్యాప్తంగా.నాగుల చవితి వేడుకలు.ఘనంగా జరుగుతున్నాయి
కృష్ణా జిల్లా, 25 అక్టోబర్ (హి.స.) :రాష్ట్ర వ్యాప్తంగా నాగుల చవితివేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. జిల్లాలోని మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీస్వామివారి నాగుల చవితి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈరోజు (శనివారం) త
రాష్ట్ర వ్యాప్తంగా.నాగుల చవితి వేడుకలు.ఘనంగా జరుగుతున్నాయి


కృష్ణా జిల్లా, 25 అక్టోబర్ (హి.స.)

:రాష్ట్ర వ్యాప్తంగా నాగుల చవితివేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. జిల్లాలోని మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీస్వామివారి నాగుల చవితి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈరోజు (శనివారం) తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాలకు స్థానిక శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్.. పుట్టలో పాలు పోసి.. ఆపై కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం 3 గంటల నుంచి భక్తులు స్వామివారి దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande