
సంగారెడ్డి, 25 అక్టోబర్ (హి.స.)
భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా పటాన్ చెరు నియోజకవర్గం నిలుస్తోందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఉత్తర భారతీయులు ప్రతి ఏటా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ఛట్ పూజ పురస్కరించుకొని శనివారం తన నివాసంలో నియోజకవర్గంలోని
50 వేల మంది ఉత్తర భారతీయులకు 10 లారీల చెరుకును తన సొంత నిధులతో కొనుగోలు చేసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఉపాధి కోసం పటాన్ చెరు నియోజకవర్గంలోని వివిధ పరిశ్రమలలో పనిచేస్తూ స్థానికంగా నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరి సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. గత 20 సంవత్సరాలుగా పటాన్ చెరులోని సాకి చెరువు కట్ట పైన నిర్వహిస్తున్న ఛట్ పూజ కార్యక్రమానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. త్వరలో సాకి చెరువు కట్ట పైన సూర్య దేవాలయం, ఫంక్షన్ హాల్ నిర్మించబోతున్నట్లు ఆయన చెప్పారు
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు