
షాద్నగర్, 25 అక్టోబర్ (హి.స.)
కర్నూలు వద్ద కావేరి ట్రావెల్స్ బస్సు
దగ్ధం సంఘటన తర్వాత ఆర్టిఏ అధికారులు అప్రమత్తమైనారు. షాద్ నగర్ పట్టణ శివారులోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద షాద్ నగర్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఫర్హాన్ ఆధ్వర్యంలో ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాల తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పాటించని రెండు ట్రావెల్స్ వాహనాలపై ఆర్టీఏ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సులలో అగ్నిమాపక సౌకర్యం, బస్సు అనుమతి పత్రాలు, ప్రధమ చికిత్సకు సంబంధించిన సౌకర్యాలు, అదేవిధంగా రవాణా అవుతున్న లగేజీ తదితర అంశాలను అధికారులు పరిశీలించారు. నిబంధనలు పాటించని రెండు బస్సులపై కేసు నమోదు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..