నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోళ్లు చేయాలి: ఇంఛార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్
రాజన్న సిరిసిల్ల, 25 అక్టోబర్ (హి.స.) కొనుగోలు కేంద్రాలను రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని తేమ శాతం ఆధారంగా, నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాలని, వ్యవసాయ విస్తరణ అధికారులు తప్పనిసరిగా కొనుగోలు కేంద్రాలను సందర్శించి, రైతులకు అవగాహన కల్పించాలని రాజన్న స
కలెక్టర్ గరీమా అగ్రవాల్


రాజన్న సిరిసిల్ల, 25 అక్టోబర్ (హి.స.)

కొనుగోలు కేంద్రాలను రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని తేమ శాతం ఆధారంగా, నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాలని, వ్యవసాయ విస్తరణ అధికారులు తప్పనిసరిగా కొనుగోలు కేంద్రాలను సందర్శించి, రైతులకు అవగాహన కల్పించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంఛార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. శనివారం సిరిసిల్ల మున్సిపల్ పరిధి పెద్దూర్లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె క్షేత్ర స్థాయిలో సందర్శించి, కేంద్రంలో రైతుల సౌకర్యార్థం చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. 17 శాతం తేమ రాగానే ఆలస్యం చేయకుండా కొనుగోళ్ళు ప్రారంభించాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడవకుండా అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, క్షేత్ర స్థాయిలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande