అన్నదమ్ముల మాదిరిగా అభివృద్ధి చేసుకున్నాం: ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
హైదరాబాద్, 25 అక్టోబర్ (హి.స.) పార్టీలకు అతీతంగా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని, ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. శనివారం ఆయన నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవుల గ్రామంలో ప
ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్


హైదరాబాద్, 25 అక్టోబర్ (హి.స.)

పార్టీలకు అతీతంగా నియోజకవర్గంలో

ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని, ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. శనివారం ఆయన నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవుల గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం నూతనంగా ప్రారంభించిన మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులను అందరం కలిసి అన్నదమ్ముల మాదిరిగా అభివృద్ధి చేసుకున్నామని తెలియజేశారు. అధికారాలతో పాటు దీనికోసం నాయకులు ఎంతో సహకరించాలని ఆయన అభినందించారు.

ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయని, వాటిని దశలవారీగా చేపడుతామని తెలియజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande