
ఆదిలాబాద్, 25 అక్టోబర్ (హి.స.)
ఆదిలాబాద్ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తాజాగా రూ.15 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ వెల్లడించారు. పట్టణంలో వివిధ 52 అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలని మే 17వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ లోని సచివాలయంలో శనివారం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఎమ్మెల్యే కు అందజేశారు. ఈ నిధులతో పలు వార్డుల్లో సీసీ రోడ్లు, మురికి కాలువలు, బీటీ రోడ్ల నిర్మాణంతో పాటు గాంధీ పార్క్ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నిధులను మున్సిపాలిటీ లో ప్రాథమిక సదుపాయాల అభివృద్ధి కోసం వినియోగించనున్నట్లు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు