
సంగారెడ్డి, 25 అక్టోబర్ (హి.స.)
చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జహీరాబాద్ మున్సిపల్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జీ కవిత దేవి అన్నారు. శనివారం జహీరాబాద్ పట్టణంలో ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడుతూ.. ప్రతీ విద్యార్థినులు పెద్దలను గౌరవించాలని, చక్కగా చదువుకోవాలని, చదువుతోపాటు సాధారణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు.
విద్యార్థులు నిత్యజీవితంలో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోకుండా ఉండడానికి, ఒకవేళ సమస్యలు ఎదురైతే వాటిని అధిగమించడానికి చట్టాలు తోడ్పాడతాయని సూచించారు. బాలికల పట్ల, మహిళల పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తించినా, వారు కఠిన శిక్షలకు లోనవుతారని తెలియజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు