అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు.. ఆసిఫాబాద్ డీఎస్పీ వహీదుద్దీన్
ఆసిఫాబాద్, 25 అక్టోబర్ (హి.స.) అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఆసిఫాబాద్ డీఎస్పీ వహీదుద్దీన్ హెచ్చరించారు. శనివారం మండలంలోని తుంగమడుగు గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు గ్రామంలో నిర్వహించిన సోదాల్లో
ఆసిఫాబాద్ డి.ఎస్.పి


ఆసిఫాబాద్, 25 అక్టోబర్ (హి.స.)

అసాంఘిక కార్యకలాపాలకు

పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఆసిఫాబాద్ డీఎస్పీ వహీదుద్దీన్ హెచ్చరించారు. శనివారం మండలంలోని తుంగమడుగు గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు గ్రామంలో నిర్వహించిన సోదాల్లో 20 లీటర్ల గుడుంబాతో పాటు 30 కేజీల బెల్లం స్వాధీనం చేసుకోగా.. 3 వేల లీటర్ల బెల్లం పాకాన్ని ధ్వంసం చేశారు. గ్రామ ప్రజలు అసాంఘిక కార్యకలాపాలతో పాటు మత్తు పదార్థాలకు దూరంగా ఉండటంతో సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు లేక అవరిచిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి సహకారించాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande