కలెక్టరేట్ గేటు ముందు వంట సామాగ్రితో నిరసన.. ఇంటికి దారి చూపాలని ఆవేదన
జగిత్యాల, 25 అక్టోబర్ (హి.స.) ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్న తమ సమస్య పరిష్కారం కావడం లేదంటూ ఓ కుటుంబం ఏకంగా కలెక్టరేట్ గేటు ఎదుట సిలిండర్, వంట సామాగ్రి తో సహా వచ్చి నిరసన వ్యక్తం చేశారు. వెల్గటూర్ మండలం జగదేవ్ పేట గ్రామానికి చెందిన నూక
జగిత్యాల కలెక్టర్


జగిత్యాల, 25 అక్టోబర్ (హి.స.)

ఎన్నిసార్లు అధికారులకు

విన్నవించుకున్న తమ సమస్య పరిష్కారం కావడం లేదంటూ ఓ కుటుంబం ఏకంగా కలెక్టరేట్ గేటు ఎదుట సిలిండర్, వంట సామాగ్రి తో సహా వచ్చి నిరసన వ్యక్తం చేశారు. వెల్గటూర్ మండలం జగదేవ్ పేట గ్రామానికి చెందిన నూకల దీవెన కుటుంబ సభ్యులతో శనివారం జగిత్యాల్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చింది. తమ ఇంటికి వెళ్లే ప్రభుత్వ దారిని కొందరు కబ్జా చేసి దారి గుండా వెళ్ళనీయడం లేదంటూ ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం తమతో పాటు పేదలకు ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చిందని అయితే తమ పొరుగున ఉన్న వాళ్ళు రెండు ఇండ్లు కట్టే స్థలంలో అక్రమంగా మూడు ఇండ్లు కట్టి ప్రభుత్వ దారిని కబ్జా చేశారని తెలిపారు. ఉన్న కాస్త దారికి అడ్డంగా ట్రాక్టర్లు బండ్లు పెడుతూ తమ ఇంటికి వెళ్లనీయకుండా చేస్తున్నారని వాపోయారు. ఈ విషయమై అనేకసార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయిందని తమకు గత్యంతరం లేకనే వంట సామాగ్రితో కలెక్టరేట్ కు వచ్చినట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande