డ్రగ్స్ నివారణకై సైకిల్ ఎక్కిన పోలీసులు.. విద్యార్థులతో కలిసి ర్యాలీ..
భద్రాద్రి కొత్తగూడెం, 25 అక్టోబర్ (హి.స.) డ్రగ్స్ నివారణకై పోలీస్ శాఖ చేపట్టిన చైతన్య యుద్ధంలో భాగంగా విద్యార్థులతో పోలీసులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని జగదాంబ సెంటర్ నుంచి కొత్త బస్టాండ్ మీదుగా శని
సైకిల్ ర్యాలీ


భద్రాద్రి కొత్తగూడెం, 25 అక్టోబర్ (హి.స.)

డ్రగ్స్ నివారణకై పోలీస్ శాఖ చేపట్టిన

చైతన్య యుద్ధంలో భాగంగా విద్యార్థులతో పోలీసులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని జగదాంబ సెంటర్ నుంచి కొత్త బస్టాండ్ మీదుగా శనివారం నిర్వహించిన సైకిల్ ర్యాలీలో, విద్యార్థులు, పోలీసులు డ్రగ్స్ సేవించడం విక్రయించడం చట్ట రీత్యా నేరం అంటూ నినాదాలు చేస్తూ కొనసాగారు. ర్యాలీలో ఇల్లెందు డీఎస్పీ చంద్రబాను, సీఐ తాటిపాముల సురేష్, ఎస్సైలు సూర్యం, హసీనా విద్యార్థులతో కలిసి సైకిల్ తొక్కుతూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, విద్యార్థులు యువత డ్రగ్స్ నివారణకు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు. యువత విద్యార్థులు డ్రగ్స్ డ్రగ్స్ పై చుట్టుపక్కల ప్రజలకు అవగాహన కల్పించి డ్రగ్స్ రహిత తెలంగాణకు కృషి చేయాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande