బాబోయ్‌.. వీళ్లు నిమ్మకాయ వాసన చూసినా నష్టపోతారు..! తిన్నారంటే అంతే సంగతి..
అమరావతి, 25 అక్టోబర్ (హి.స.)ముఖ్యంగా వేసవిలో అధిక వేడి, ఉక్కపోత వల్ల చెమటలు పట్టడం, శరీరం డీహైడ్రేషన్‌కు గురికావడం ప్రారంభవుతుంది. అయితే నిమ్మ రసం గ్లాసుడు తాగితే ఈ మొత్తం బాధలన్నీ చిటికెలో ఎగిరిపోతాయి. ఇందులోని విటమిన్ సి శరీరాన్ని చల్లబరచడమే కాకు
Side Effects Of Consuming Excess Of Lemon Water in telugu


అమరావతి, 25 అక్టోబర్ (హి.స.)ముఖ్యంగా వేసవిలో అధిక వేడి, ఉక్కపోత వల్ల చెమటలు పట్టడం, శరీరం డీహైడ్రేషన్‌కు గురికావడం ప్రారంభవుతుంది. అయితే నిమ్మ రసం గ్లాసుడు తాగితే ఈ మొత్తం బాధలన్నీ చిటికెలో ఎగిరిపోతాయి. ఇందులోని విటమిన్ సి శరీరాన్ని చల్లబరచడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అందుకే వేసవిలో చాలా మంది నిమ్మ రసం తాగుతుంటారు.

నిమ్మకాయ చేసే మేలు దాదాపు అందరికీ తెలుసు..నిమ్మకాయలో సి-విటమిన్‌ అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. ఇందులోని సిట్రిక్‌ యాసిడ్‌ చర్మం ముడతలు పడకుండా, కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. ఇలా ఒకటేమిటి ఎన్నో పోషకాలు కలిగిన అద్భుత ఫలం నిమ్మకాయ. ముఖ్యంగా వేసవిలో అధిక వేడి, ఉక్కపోత వల్ల చెమటలు పట్టడం, శరీరం డీహైడ్రేషన్‌కు గురికావడం ప్రారంభవుతుంది. అయితే నిమ్మ రసం గ్లాసుడు తాగితే ఈ మొత్తం బాధలన్నీ చిటికెలో ఎగిరిపోతాయి. ఇందులోని విటమిన్ సి శరీరాన్ని చల్లబరచడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అందుకే వేసవిలో చాలా మంది నిమ్మ రసం తాగుతుంటారు.

అయితే, కొన్ని ఆరోగ్య సమస్యలున్న వారు ఎట్టిపరిస్థితుల్లోనూ నిమ్మ రసం తాగకూడదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా అధిక ఆమ్లత్వం ఉన్నవారు నిమ్మరసం అస్సలు తాగకూడదు. అలాగే, తరచుగా గుండెల్లో మంట, పుల్లని త్రేన్సులు, కడుపులో గ్యాస్ వంటి సమస్యలు ఉన్నవారు నిమ్మ రసానికి దూరంగా ఉండాలి. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ ఆమ్లం.. కడుపులో ఆమ్లతను మరింత పెంచి సమస్యను తీవ్రతరం చేస్తుంది.

కడుపులో అల్సర్ ఉంటే నిమ్మకాయ నీళ్లు తాగడం అంత మంచిది కాదు. నిమ్మకాయలోని ఆమ్లం వ్రణోత్పత్తి ప్రాంతానికి మరింత నష్టం కలిగిస్తుంది. ఇది నొప్పి, చికాకును కూడా పెంచుతుంది. నిరంతర కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉన్నవారు కూడా నిమ్మ రసం నివారించాలి. నిమ్మ రసం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. ఇది కీళ్లలో వాపు, నొప్పిని మరింత పెంచుతుంది. ఒకవేళ తాగవల్సి వస్తే తక్కువ పరిమాణంలో వేడి లేదా గోరువెచ్చని నీటిలో కలిపి తాగవచ్చునని సూచిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande