
ఢిల్లీ,25, అక్టోబర్ (హి.స.)
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. మెహ్రౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఉదయం 4 గంటలకు పోలీసులకు-వాంటెడ్ క్రిమినల్ కోకు పహాడియా మధ్య కాల్పులు జరిగాయి. మొదట నేరస్థుడు కాల్పులు జరపగా.. అనంతరం పోలీసులు ఎదురుకాల్పులకు దిగారు. నేరస్థుడు జరిపిన కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ రవీంద్రకు గాయాలు కాగా.. బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లను ధరించిన మరో ఇద్దరు పోలీసులకు ప్రమాదం తప్పింది. ఎట్టకేలకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఎదురుకాల్పుల్లో పహాడియాకు గాయాలు కావడంతో చికిత్స కోసం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆయుధ సరఫరాతో పాటు అనేక కేసుల్లో పహాడియా వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్నారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని ఢిల్లీ పోలీసులు తెలిపారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ