
ఢిల్లీ,25, అక్టోబర్ (హి.స.)
బీహార్‌లో ప్రస్తుతం ఓట్ల పండుగ జరుగుతోంది. తాజాగా ఓట్ల పండుగతో పాటు తరతరాలుగా ఆచారంగా వస్తున్న ఛత్ ఫెస్టివల్ కూడా వచ్చేసింది. దీంతో రాష్ట్రమంతటా సందడి.. సందడి వాతావరణం.. కోలాహలం కనిపిస్తోంది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఛత్ పండుగ జరగనుంది. ఈ పండుగ కోసం రాష్ట్రం బయట ఎక్కడున్నా సరే సొంత గ్రామాలకు వచ్చేస్తారు. అంత ఉత్సాహంగా.. ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఛత్ పండుగ శుభాకాంక్షలు చెప్పారు.
ఛత్ అనేది ఒక పురాతన ఇండో-నేపాల్ హిందూ పండుగ. తూర్పు భారతదేశం-దక్షిణ నేపాల్‌కు చెందిన పండుగ. ముఖ్యంగా భారతదేశంలోని బీహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ పండుగ జరుపుకుంటారు. అలాగే నేపాల్‌లోని కోషి, గండకి, బాగ్మతి, లుంబిని, మాధేష్ ప్రావిన్సుల్లో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు కూడా ఎంతో ఆనందంగా ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ