
ఢిల్లీ, 25 అక్టోబర్ (హి.స.) దేశ రాజధాని అయిన ఢిల్లీ నగరంలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. రెండు రోజుల క్రితం బీహార్ పోలీసులతో కలిసి ఢిల్లీ పోలీసులు నలుగురు వాంటెడ్ క్రిమినల్స్ ను ఎన్ కౌంటర్ చేశారు. తాజాగా అలాంటి ఘటనే శనివారం తెల్లవారుజామున మెహ్రౌలి ప్రాంతంలో చోటుచేసుకుంది. వాంటెడ్ క్రిమినల్ అయిన కోకు పహాడియా సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని పట్టుకునేందుకు వెళ్లారు. ఇది గమనించిన క్రిమినల్ పోలీసులపై ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు క్రిమినల్ కోకు పహాడియా కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో గాయపడ్డ క్రిమినల్ ను అదుపులోకి తీసుకొని.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి స్థిరంగా ఉందని చెబుతున్నారు. ఆయుధ సరఫరా తో సహా అనేక కేసుల్లో అతను వాంటెడ్ వ్యక్తిగా ఉన్నాడు. తదుపరి దర్యాప్తు జరుగుతోందని, నింధితుడి కాల్పుల్లో ఓ కానిస్టేబుల్ కు గాయాలు అయ్యాయని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV