
చెన్నై ,25, అక్టోబర్ (హి.స.)
శబరిమల ఆలయంలో బంగారు తాపడాల (Sabarimala Gold Theft) నుంచి వేరు చేసిన పసిడిని కర్ణాటకలోని ఓ వ్యాపారికి విక్రయించినట్లు ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టీ అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేరళ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలోని కేరళ సీసీబీ పోలీసుల బృందం శుక్రవారం బళ్లారికి చేరుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. బళ్లారిలోని ఓ బంగారు దుకాణంలో, స్థానికంగా ఉన్న ఇతర ప్రాంతాల్లో కేరళ పోలీసులు విచారణ చేపడుతున్నారన్నారు. అయితే ఈ విషయంపై కేరళ అధికారుల నుంచి తమకు ఎటువంటి అధికారిక సమాచారం అందలేదని తెలిపారు.
చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్‌లో ఈ బంగారు తాపడాల నుంచి పసిడిని వేరు చేసి.. పుత్తడిని బళ్లారికి చెందిన బంగారం వ్యాపారి గోవర్ధన్‌కు విక్రయించినట్లు ఉన్నికృష్ణన్ విచారణలో సిట్ అధికారులకు చెప్పారు.
5
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ