భద్రతా విధుల్లో నిర్లక్ష్యం.. TTD మాజీ చైర్మన్ గన్‌మెన్ సస్పెన్షన్
తిరుమల, 25 అక్టోబర్ (హి.స.) టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy)కి పోలీసులు మరో బిగ్ షాకిచ్చారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 6న సతీసమేతంగా భూమన తిరుమల శ్రీ వెంకటేశ్వర వారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వా
ం


తిరుమల, 25 అక్టోబర్ (హి.స.) టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy)కి పోలీసులు మరో బిగ్ షాకిచ్చారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 6న సతీసమేతంగా భూమన తిరుమల శ్రీ వెంకటేశ్వర వారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వాళ్ల వెంట ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ చెన్నారెడ్డి కూడా తుపాకీని పక్కకు పెట్టి భూమన దంపతులతో పాటు ఆలయంలోకి వెళ్లాడు. అయితే, భద్రతా విధుల్లో చెన్నారెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించారని పెద్ద ఎత్తున ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతో ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. వచ్చిన అభియోగాలు నిజమని తేలడంతో తాజాగా చెన్నారెడ్డిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఇవాళ ఎస్పీ సుబ్బారాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande