
గోపాల్‌గంజ్: ,25, అక్టోబర్ (హి.స.)
బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో భాజపా తిరుగుబాటు అభ్యర్థి అనుప్ కుమార్ శ్రీవాస్తవకు మద్దతిస్తున్నట్లు జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ శుక్రవారం ప్రకటించారు. కాషాయ పార్టీ ఒత్తిడి కారణంగానే తమ పార్టీ అభ్యర్థి శశి శేఖర్ సిన్హా పోటీ నుంచి వైదొలిగారని ఆరోపించారు. గోపాల్‌గంజ్‌లో కిశోర్ విలేకరులతో మాట్లాడారు. ‘సామాజిక కార్యకర్త శ్రీవాస్తవ భాజపా జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఈ నియోజకవర్గంలో శ్రీవాస్తవ, జన్ సురాజ్ పార్టీ ఇద్దరూ భాజపా అన్యాయానికి బాధితులే’ అని కిశోర్ వివరించారు. ‘ఇక నుంచి శ్రీవాస్తవ జన్ సురాజ్ పార్టీలో భాగమవుతారు. స్వతంత్ర అభ్యర్థి అయినప్పటికీ మా పూర్తి మద్దతు ఆయనకు ఉంటుంది’ అని కిశోర్ స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ