ఏఎస్ పేట మండలంలో గుప్త నిధుల కోసం వేట
నెల్లూరు, 25 అక్టోబర్ (హి.స.)నెల్లూరు జిల్లాలోని ఏఎస్ పేట మండలంలో ఉన్న చిరమన గ్రామంలో గుప్త నిధుల కోసం సాగిన వేట స్థానికంగా కలకలం రేపింది. గుప్త నిధుల కోసం పురాతన ఆలయాల (Ancient Temple) విధ్వంసం జరుగుతోందనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. గతంలో కూడ
/sri-potti-sriramulu-nellore-district/hunt-for-hidden-funds-in-as-peta-mandal-487178


నెల్లూరు, 25 అక్టోబర్ (హి.స.)నెల్లూరు జిల్లాలోని ఏఎస్ పేట మండలంలో ఉన్న చిరమన గ్రామంలో గుప్త నిధుల కోసం సాగిన వేట స్థానికంగా కలకలం రేపింది. గుప్త నిధుల కోసం పురాతన ఆలయాల (Ancient Temple) విధ్వంసం జరుగుతోందనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. గతంలో కూడా ఎన్నో పురాతన దేవాలయాలను గుప్త నిధుల కోసం నాశనం చేసినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే ఏఎస్ పేట మండలం పరిధిలోని చిరమన గ్రామంలో చంద్రమౌళీశ్వర స్వామి (Chandra Moulishwara Swami) పురాతన ఆలయం ఉంది. అందులో అకస్మాత్తుగా దొంగలు పడ్డారనే విషయం గ్రామంలో కలకలం రేపింది. అయితే దేవాలయంలోని ఏ వస్తువును కూడా దుండగులు తాకలేదు. కేవలం ఒక శాసనం ఉన్న రాతిని తొలగించే ప్రయత్నం చేశారు. అయితే ఆ రాతి కింద గుప్త నిధులు ఉన్నాయనే అనుమానంతోనే నిందితులు ఇంతకు తెగబడ్డారని గ్రామస్తులు అనుకుంటున్నారు. నిధుల వేటలో భాగంగా గుడి తాళాలు పగలగొట్టి మరీ గుడిలోకి వెళ్లారని అనుమానిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande