ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 40 నెమళ్లు మృతి
తెన్‌కాశీ, 26 అక్టోబర్ (హి.స.) ఆహారం తినడానికి ఓ రైతు పోలంలోకి వెళ్లిన జాతీయ పక్షులు (National birds) అయిన 40 నెమళ్లు (peacocks) మృత్యువాత పడ్డాయి. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులోని తెన్‌కాశీ జిల్లా ప‌రిధిలోని మీనాక్షిపురం గ్రామంలో చోటు చేసుకుంది. వివరా
40 నెమళ్లు మృతి


తెన్‌కాశీ, 26 అక్టోబర్ (హి.స.) ఆహారం తినడానికి ఓ రైతు పోలంలోకి వెళ్లిన జాతీయ పక్షులు (National birds) అయిన 40 నెమళ్లు (peacocks) మృత్యువాత పడ్డాయి.

ఈ షాకింగ్ ఘటన తమిళనాడులోని తెన్‌కాశీ జిల్లా ప‌రిధిలోని మీనాక్షిపురం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మీనాక్షిపురం గ్రామానికి చెందిన జాన్సన్ అనే రైతు త‌న‌కున్న ఎక‌రా పొలంలో మొక్కజొన్న పంటను సాగు చేశాడు. అయితే పంట చేతికి వ‌చ్చే స‌మ‌యం కావడంతో.. ప‌క్షులు, ఇతర జంతువుల బెడద ఎక్కువైంది. దీంతో రైతు జాన్సన్ తన పొలం చుట్టూ ఎలుక‌ల మందును క‌లిపిన ఆహార ప‌దార్థాలను చల్లి వెళ్లిపోయాడు. సాయంత్రం పదుల సంఖ్యలో అటుగా వచ్చిన నెమళ్లు.. రైతు జాన్సన్ చల్లిన విషపు గింజలను తిని కొద్ది సేపటికే కుప్పకూలిపోయాయి.

అటుగా వెళ్తున్న ఓ పశువుల కాపరి.. జాన్సన్ పోలంలో పదుల సంఖ్యలో నెమళ్లు (peacocks) చనిపోవడం గమనించి.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఈ స‌మాచారం అందుకున్న పోలీసులు అట‌వీశాఖ అధికారులతో క‌లిసి జాన్సన్ (Johnson) పొలం వ‌ద్దకు చేరుకున్నారు. అనంతరం ఎలుకల మందు కలిపిన గింజలు తినడం వల్లే 40 పెద్ద నెమళ్లు ప్రాణాలు కోల్పోయినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande