కర్నూలు బస్సు ప్రమాదం నేపద్యంలో ఏపీ. రవాణా శాఖ.ప్రత్యేక డ్రైవ్
అమరావతి, 26 అక్టోబర్ (హి.స.) కర్నూలు: కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో ఏపీ రవాణా శాఖ చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది. రవాణా శాఖ కమిషనర్ మనీశ్‌ కుమార్ సిన్హా ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో రెండు రోజులుగా ప్రైవేటు వాహనాలను వ
కర్నూలు బస్సు ప్రమాదం నేపద్యంలో ఏపీ. రవాణా శాఖ.ప్రత్యేక డ్రైవ్


అమరావతి, 26 అక్టోబర్ (హి.స.)

కర్నూలు: కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో ఏపీ రవాణా శాఖ చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది. రవాణా శాఖ కమిషనర్ మనీశ్‌ కుమార్ సిన్హా ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో రెండు రోజులుగా ప్రైవేటు వాహనాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. ఇప్పటి వరకు నిబంధనలు ఉల్లంఘిస్తూ తిరుగుతున్న 361 ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. 40 బస్సులను సీజ్ చేశారు. అనుమతి లేకుండా బస్సులో సీటింగ్ మార్పులు చేసిన 63 ట్రావెల్స్ బస్సులు గుర్తించారు. అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయని ట్రావెల్స్‌పై భారీగా జరిమానాలు విధించారు.

అత్యవసర ద్వారాలు లేకుండా తిరుగుతున్న 11, అగ్నిమాపక పరికరాలు లేని 83 బస్సులపై కేసులు నమోదు చేసి జరిమానా విధించారు. బస్సుల్లో తగిన ఫైర్ అలారం, రక్షణ వ్యవస్థ లేని 14 బస్సులను గుర్తించారు. అనుమతి లేకుండా గూడ్స్, పార్సిళ్లను తీసుకెళ్లే 11 బస్సులకు జరిమానా విధించారు. నంద్యాల జిల్లాలో అత్యధికంగా 66, పల్నాడు 36, ప్రకాశం జిల్లాలో 34 బస్సులపై కేసులు నమోదు చేశారు. తిరుపతి జిల్లాలో 25, చిత్తూరు 8, కర్నూలు 14, ఎన్టీఆర్ 42, అన్నమయ్య జిల్లాలో 21 ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. బస్సుల్లో తనిఖీలు చేస్తూనే ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర ద్వారాల నుంచి ఎలా సురక్షితంగా బయటపడాలనే విషయమై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande