డిఎల్ఆర్ఎల్ (డీఆర్డీఓ )లో 'ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 6.0' ఘనంగా ప్రారంభం
హైదరాబాద్, 26 అక్టోబర్ (హి.స.) భారత రక్షణ పరిశోధన సంస్థ డీఆర్డీఓ(డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ) పరిధిలోని డీఎల్ఆర్ఎల్ (డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ లేబరటరీ ) లో ఆదివారం ఉదయం ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 6.0” కార్యక్రమం ఘనంగా ప్
ఫ్రీడం రన్


హైదరాబాద్, 26 అక్టోబర్ (హి.స.)

భారత రక్షణ పరిశోధన సంస్థ డీఆర్డీఓ(డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ) పరిధిలోని డీఎల్ఆర్ఎల్ (డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ లేబరటరీ ) లో ఆదివారం ఉదయం ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 6.0” కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఫిట్ ఇండియా మూవ్మెంట్ లో భాగంగా డీఎల్ఆర్ఎల్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో ట్రీట్ ఇండియా ఫ్రీడమ్ 6.0 రన్& సైకిల్ ర్యాలీ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ రన్ను డిఎల్ఆర్ఎల్ డైరెక్టర్ డాక్టర్ కె. మురళీ ఉదయం 8 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. ఆయన ఫిట్నెస్ను ప్రతి వ్యక్తి రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. “ఫిట్నెస్ అనేది కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు, జాతీయ ఉత్పత్తి, క్రమశిక్షణ, మరియు దేశ సేవకు కూడా పునాది” అని ఆయన అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande