మంత్రులు, ముఖ్యమంత్రి తన్నుకుంటున్నారు.. కేబినెట్పై హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్, 26 అక్టోబర్ (హి.స.) కాంగ్రెస్ పాలన ఇంట్లో ఈగల మోతా.. బయట పల్లకీల మోతల ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. పంపకాల్లో తేడా వచ్చి మంత్రులు, ముఖ్యమంత్రి తన్నుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తెలంగాణ భవన్ల
హరీష్ రావు


హైదరాబాద్, 26 అక్టోబర్ (హి.స.)

కాంగ్రెస్ పాలన ఇంట్లో ఈగల మోతా.. బయట పల్లకీల మోతల ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. పంపకాల్లో తేడా వచ్చి మంత్రులు, ముఖ్యమంత్రి తన్నుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తెలంగాణ భవన్లో వడ్డెర సంఘం సమావేశానికి హాజరైన హరీష్ రావు.. మాట్లాడుతూ.. మొన్న కొండా సురేఖ కూతురు, నిన్న జూపల్లి కృష్ణారావు ఎలా మాట్లాడారో కేబినెట్ మీటింగ్లో చూశామని, ముఖ్యమంత్రి, మంత్రులు బట్టలూడ తీసుకొని తిట్టుకున్నారట అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రజల గురించి చూడడం లేదని వాళ్ళు తన్నుకోడానికి, వాటాలు పంచుకోవడానికి సరిపోతోందని విమర్శించారు. మళ్లీ కేసీఆర్ వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande