ఏకంగా సజ్జనార్ పేరుతో సైబర్ నేరగాళ్ల మోసాలు.. స్పందించిన సిపి
హైదరాబాద్, 26 అక్టోబర్ (హి.స.) సైబర్ నేరాలపై నిత్యం ప్రజల్లో అవగాహన తీసుకొచ్చే.. ఐపీఎస్ అధికారి, హైదరాబాద్ సిపి సజ్జనార్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు ప్రయత్నిస్తున్నారు. ఏకంగా సజ్జనార్ ఫోటోను వాట్సాప్ డీపీ గా పెట్టుకొని ప్రజలకు సైబర్ నేరగాళ్ల
సజ్జనార్


హైదరాబాద్, 26 అక్టోబర్ (హి.స.)

సైబర్ నేరాలపై నిత్యం ప్రజల్లో

అవగాహన తీసుకొచ్చే.. ఐపీఎస్ అధికారి, హైదరాబాద్ సిపి సజ్జనార్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు ప్రయత్నిస్తున్నారు. ఏకంగా సజ్జనార్ ఫోటోను వాట్సాప్ డీపీ గా పెట్టుకొని ప్రజలకు సైబర్ నేరగాళ్లు వాట్సాప్ లో మెసేజులు పంపుతున్నారు. ఇది గమనించిన సీపీ సజ్జనార్.. తన పేరుతో వస్తున్న మెసేజులకు ఎవరూ స్పందించ వద్దని, అలాంటి నెంబర్లను వెంటనే బ్లాక్ చేసి రిపోర్టు కొట్టాలని ఈ సందర్బంగా సూచించారు. అలాగే ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో సైబర్ నేరగాళ్లకు తమ వ్యక్తిగత వివరాలను ఇవ్వొద్దని, ఎవరైన వివిధ ఆరోపణలు చేసి, బెదించిన, డబ్బులు డిమాండ్ చేసిన పంపవద్దని ఇలాంటి బెదిరింపులు వచ్చిన వారు భయపడకుండా వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి సమాచారం అందించాలని ఈ సందర్భంగా కమిషనర్ సజ్జనార్ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande