నా వెనకాల మొరిగేటోళ్లను పట్టించుకోను.. కవిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్
నిజామాబాద్, 26 అక్టోబర్ (హి.స.) ఒక్కసారి కమిట్ అయితే నా మాట ఆమె నేనే విననని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆమె చేపట్టిన ''జాగృతి జనం బాట''పై వస్తున్న విమర్శలకు ఇవాళ నిజామాబాద్లో కౌంటర్ ఇచ
జాగృతి కవిత


నిజామాబాద్, 26 అక్టోబర్ (హి.స.)

ఒక్కసారి కమిట్ అయితే నా మాట

ఆమె నేనే విననని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆమె చేపట్టిన 'జాగృతి జనం బాట'పై వస్తున్న విమర్శలకు ఇవాళ నిజామాబాద్లో కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మనం పెంచి పోషించిన నాయకులు మనల్నే విమర్శించడం రాజకీయాల్లో కొత్తమీ కాదని అన్నారు. చేసేది సద్విమర్శ కావాలని.. ప్రజల పక్షాన పోరాటం చేసే విమర్శ కావాలన్నారు. పర్సనల్గా ఎటాక్ చేస్తే ప్రజలు ఎవర్నీ కూడా క్షమించబోరని పేర్కొన్నారు.

ప్రజల సమస్యలే తమ సమస్యలని.. వాటి కోసమే ప్రభుత్వంతో కొట్లాడుతున్నామని అన్నారు. ఆ దారిలోనే తాము జాగృతి జనం బాట కార్యక్రమాన్ని చేపట్టామని స్పష్టం చేశారు. తమ వెనుక చాలా మంది మొరుగుతుంటారని.. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని కవిత అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande