
హైదరాబాద్, 26 అక్టోబర్ (హి.స.)
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికకు
సర్వం సిద్ధమైంది. ఇప్పటికే బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. నవంబర్ 11న పోలింగ్ జరిగే ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లుగా ఇప్పటికే రిటర్నింగ్ అధికారి సాయిరాం ప్రకటించారు. ఈ మేరకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఇవాళ గుర్తులను కూడా కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే, బ్యాలెట్ పేపర్లో మొదటి స్థానం బీజేపీ అభ్యర్థి లంకల దీపన్రెడ్డి (కమలం), రెండో స్థానం కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ (చేయి), మూడో స్థానం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతగోపీనాథ్ (కారు)కు కేటాయించారు.
కాగా, జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 81 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వారిలో మొత్తం 23 మంది నామినేషన్లను ఉపసంహరించుకోగా.. 58 మంది పోటీలో ఉన్నట్లు ఆర్వో సాయిరాం వెల్లడించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు