రాష్ట్రమంతా తిరిగినా కవితకు 400 ఓట్లు రావు: ఎంపీ అర్వింద్
హైదరాబాద్, 26 అక్టోబర్ (హి.స.) రాష్ట్రమంతా తిరిగినా కల్వకుంట్ల కవితకు 400 ఓట్లు కూడా రావని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. ''జాగృతి జనం బాట'' జిల్లాల పర్యటన సందర్భంగా కవిత చేసిన వ్యాఖ్యలపై అర్వింద్ స్పందించారు. తాజాగా ఓ న్యూస్
మంత్రి కోమటిరెడ్డి


హైదరాబాద్, 26 అక్టోబర్ (హి.స.)

రాష్ట్రమంతా తిరిగినా కల్వకుంట్ల కవితకు 400 ఓట్లు కూడా రావని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. 'జాగృతి జనం బాట' జిల్లాల పర్యటన సందర్భంగా కవిత చేసిన వ్యాఖ్యలపై అర్వింద్ స్పందించారు. తాజాగా ఓ న్యూస్ చానల్తో మాట్లాడిన అర్వింద్ బీఆర్ఎస్ హయాంలో ఉద్యమకారులకు ఎందుకు న్యాయం చేయలేదో ఫామ్ హౌస్ కు వెళ్లి కేసీఆర్ ను కవిత అడగాలన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవిత అక్రమంగా సంపాధించిన కోట్లాది రూపాయలు తీసుకువచ్చి అమరవీరుల కుటుంబాలకు ఇచ్చి న్యాయం చేయాలన్నారు. నాలుగు సంవత్సరాలు కాదు కదా నాలుగు జన్మలెత్తినా ప్రజలు కవితకు ఓట్లు వేయరన్నారు. కేసీఆర్ ఫోటో లేకుండా కవితను ఎవరూ పట్టించుకోరని, కేసీఆర్ ఫోటోతోనే కవిత తన జీవితంలో ఒక్క సారి ఎంపీ అయ్యారని విమర్శించారు. జూబ్లీహిల్స్ లో బీజేపీ పరిస్థితిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అడగాలన్నారు. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎన్ని బీజేపీ ఎన్ని స్థానాలు గెలవబోతోంది అనేది చెప్పగలను కానీ జూబ్లీహిల్స్ నేనెట్లా చెప్పగలనన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande