కొండా సుస్మిత వ్యాఖ్యలు.. పార్టీ నేతలకు మహేశ్ కుమార్ గౌడ్ హెచ్చరిక
న్యూఢిల్లీ, 26 అక్టోబర్ (హి.స.) కులాల గురించి మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత వ్యాఖ్యలు సరికాదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మంత్రుల పంచాయితీ ముగిసిన అధ్యాయం అని పార్టీ నేతలు ఆచితూచి మాట్లాడాలన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.
మహేశ్ కుమార్ గౌడ్


న్యూఢిల్లీ, 26 అక్టోబర్ (హి.స.)

కులాల గురించి మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత వ్యాఖ్యలు సరికాదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మంత్రుల పంచాయితీ ముగిసిన అధ్యాయం అని పార్టీ నేతలు ఆచితూచి మాట్లాడాలన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. ఇవాళ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంత్రుల వివాదంపై సీఎంతో అధిష్టానం మాట్లాడి ఉండొచ్చని చెప్పారు. డీసీసీ నియామకాలపై రాష్ట్ర నాయకత్వం అభిప్రాయాలు తెలియజేస్తున్నామని చెప్పారు. కాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అక్కడ ఏఐసీసీ పెద్దలతో భేటీ అవుతున్నారు. నిన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. మంత్రుల మధ్య వివాదాలు మరోసారి పునరావృతం కావొద్దని అధిష్టానం కేసీ వేణుగోపాల్ హెచ్చరించినట్లు సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande