
అమరావతి, 26 అక్టోబర్ (హి.స.)
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న ప్రముఖ హిల్ స్టేషన్లు వివాదంలో చిక్కుకున్నాయి. మడగడ, వనజంగిలో ఎకో టూరిజం ప్రాజెక్టు కోసం భూములను అటవీశాఖ స్వాధీనం చేసుకోవడానికి ట్రై చేయగా ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సమస్య జఠిలంగా మారడంతో నేరుగా కలెక్టర్ జోక్యం చేసుకుని సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, ఉరితాళ్ళతో గిరిజనులు ఆందోళనకు దిగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అయితే, అల్లూరి సీతారామరాజు జిల్లాలో మంచు తెరలు కమ్ముకుంటున్నాయి. వింటర్ కు గ్రాండ్ వెల్కమ్ చెబుతూ ప్రకృతి ఆహ్లాదాన్ని పరుచుకుంటోంది. ఈ నెలాఖరు నుంచి అరకు పర్యాటక సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడకు వచ్చే టూరిస్టుల్లో ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న స్పాట్స్ లో పాడేరు సమీపంలోని వంజంగి కొండ, అరకు లోయ దగ్గర మడగడ హిల్ పార్క్ లు. ఇక్కడ నుంచి సూర్యోదయం చూడటం క్రేజ్ గా ఫీల్ అవుతుంటారు పర్యాటకులు. వేకువ జామునే ఎంతో ఉల్లాసాన్ని, ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇచ్చే ఈ మడగడ వ్యూ పాయింట్ దగ్గర ఇప్పుడు భూమి వివాదం కొనసాగుతుంది. ఈ భూమి మాది అంటే మాదేనంటూ అటవీ, రెవెన్యూ, మడగడ గ్రామస్తులు పోరాట చేస్తున్నారు.
ఇక, ఐదేళ్ల క్రితం ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ వ్యూ పాయింట్ తొందరలోనే ఎంతో ఫేమస్ అయింది. మడగడ వ్యూ పాయింట్ ను ఆధారంగా చేసుకుని చుట్టుపక్కల గ్రామాల గిరిజనులు సుమారు 600 కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ఈ స్పాట్ కి వచ్చే సందర్శకులకు టీ, కాఫీలు, తిను బండరాలు, స్థానిక ఉత్పత్తుల విక్రయం, దింసా నృత్యాలు, గిరిజన వేషధారణ ఇలా పలు రకాలుగా పర్యాటకులను స్థానిక గిరిజనులు అలరిస్తున్నారు. టూరిస్టులను ఆకర్షిస్తూ తద్వారా గిరిజనులు ఉపాధిని పొందుతున్నారు. మడగడ సన్రైజ్ వ్యూ పాయింట్ అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు చేపట్టకపోగా ఇప్పుడు ఆ ప్రదేశం తమదంటూ అటవీ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారని స్థానిక గిరిజనులు ఉరి తాళ్లతో నిరసన వ్య
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ