జూబ్లీహిల్స్లో మా విజయం ఖరారైంది.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
హైదరాబాద్, 26 అక్టోబర్ (హి.స.) రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన జూబీహిల్స్ నియోజకవర్గ పరిధిలో తమ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా లోకల్ కాంగ్రెస్ నేతలతో కలిసి ప్రచారం న
మంత్రి కోమటిరెడ్డి


హైదరాబాద్, 26 అక్టోబర్ (హి.స.)

రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని

ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన జూబీహిల్స్ నియోజకవర్గ పరిధిలో తమ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా లోకల్ కాంగ్రెస్ నేతలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ దోపిడీని భరించలేకపోయారని కమామెంట్ చేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి అధికారన్ని కట్టబెట్టారని తెలిపారు. జూబ్లీహిల్స్ కూడా తమ అభ్యర్థి గెలుపు ఖాయమని అన్నారు. ఇటీవల జరిగిన కంటోన్మెంట్లో బై ఎలక్షన్లో సెంటిమెంట్ పని చేయలేదని గుర్తు చేశారు. పదేళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ మా అభ్యర్థి గురించి మాట్లాడాడంటే మా విజయం అప్పుడే ఖాయమైదని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande